మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం: సీఎం చంద్రబాబు

Date:

ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ నుంచి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు ప్యానిక్ అవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్‌లను పెంచేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంచి, మెరుగైన పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని కేజీ(కృష్ణా గోదావరి) బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని పేర్కొన్నారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్ఠంగా పెంచే అవకాశాలను పరిశీలించాలని మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు హాజరయ్యారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...