వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలోని ఓ వార్డులో పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ‘గుంపు మేస్త్రీ’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

“మన ముఖ్యమంత్రిని గుంపు మేస్త్రీ అంటారు. గుంపు మేస్త్రీ అనడంలో తప్పేముంది.. మంచిదే కదా. వనపర్తికి నేను గుంపు మేస్త్రీ.. తెలంగాణ రాష్ట్రానికి రేవంతన్న గుంపు మేస్త్రీ” అని మేఘారెడ్డి అన్నారు.

గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా ఒక గుంపు అని, ఆ గుంపుకు తానే మేస్త్రీనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

By Ramya