అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. రిచ్‌మండ్ హైట్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ వడ్తాల్ ధామ్ హిందూ మందిర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలతో దాడి చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించింది.

ఆలయంపై ఇటుకలతో దాడి చేయడంతో కిటికీలు దెబ్బతిన్నట్లు తెలిపింది. దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజారులు, భక్తులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు ఆలయం సమీపంలోని నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

By Ramya