కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టమైన విధానం ఉండాలి: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Date:

గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమిలో భాగస్వామ్య పార్టీలు వేరైనా, ప్రభుత్వాల బాధ్యత రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని ఉద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోతే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోలవరం ముంపు పరిధిలోని భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించాలన్నారు. ‘ఒడిశాలో భూసేకరణ కోసం అవసరమైతే 10 నుంచి 15 రెట్లు పరిహారం ఇచ్చినా నష్టం లేదు. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాను’ అని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆయన.

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే ఏపీ 277 టీఎంసీలు, తెలంగాణ 97 టీఎంసీల నీటిని నష్టపోతాయని హెచ్చరించారు. ఇది రెండు రాష్ట్రాలకు ‘డబుల్ పంచ్’ లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ‘ముఖ్యమంత్రులు కలవడంలో తప్పులేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం సాధిస్తున్నారనేదే ముఖ్యం’ అని అన్నారు. గతంలో తాను కృష్ణా జలాల పరిరక్షణ కోసమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...