పీరియడ్స్‌ సమస్యలు, మొటిమలకు కారణమయ్యే PMOS తగ్గడానికి సింపుల్‌ ఇంటి చిట్కా చెప్పిన నటి భాగ్యశ్రీ

Date:

మహిళల్లో ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో PMOS/PCOS కూడా ఒకటి. ఈ సమస్య వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, ముఖంపై అవాంఛిత వెంట్రుకలు పెరగడం, బరువు పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో మైనే ప్యార్‌ కియా (Maine Pyar Kiya) మూవీ ఫేమ్‌ ప్రముఖ నటి భగ్యశ్రీ తన సోషల్ మీడియాలో ఒక సులభమైన ఇంటి చిట్కాను పంచుకున్నారు. అదేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.

PMOS (పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్), దీన్నే గతంలో PCOSగా పిలిచేవాళ్లు. ఈ రోజుల్లో మహిళలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ హార్మోన్ల సమస్యల్లో ఒకటి. దీనివల్ల పీరియడ్స్‌ టైమ్‌కు రాకపోవడం, మొటిమలు, ముఖంపై అవాంఛిత రోమాలు , బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది హార్మోన్ల సమతుల్యతకు సహాయపడే సులభమైన ఇంటి చిట్కాల కోసం కూడా చూస్తుంటారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటి భాగ్యశ్రీ PMOS లక్షణాలను తగ్గించే చిట్కాను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. అతిమధురం (Licorice Root) నీటిని తాగితే PMOS లక్షణాలు తగ్గుతాయని ఆమె తెలిపారు. దీంతో ఈ చిట్కాపై చాలామందిలో ఆసక్తి పెరిగింది. అయితే అతిమధురం నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ నీటిని ఎలా తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

భాగ్య శ్రీ ఏమన్నారంటే

“PCOS అనేది ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. PCOSలో ఆండ్రోజెన్ అనే పురుష హార్మోన్ పెరుగుతుంది. దీనివల్ల మహిళలకు పీరియడ్స్‌ సమయానికి రాకపోవడం, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు వంటి సమస్యలు రావచ్చు. ఒక కప్పు నీటిలో చిన్న ముక్క అతిమధురం వేరును వేసి, తక్కువ మంటపై ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత దానిని వడకట్టి, వేడిగా ఉన్నప్పుడే తాగండి. అతిమధురం ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...