మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

Date:

మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన బుధవారం రాత్రి ఆదోని నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీిపీకి కార్యకర్తలే అధినేతలు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. క్రమశిక్షణతో బాధ్యతగా పని చేయండి. మేమే వెతుక్కుంటూ వచ్చి పదవులు ఇస్తాం.’’ అని అన్నారు. టీడీపీ శాశ్వతమని, ఈ విషయాన్ని ప్రతి కార్యకర్తా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ‘‘2019-24 మధ్య ఎన్నో కష్టాలు పడ్డారు.

ప్రాణాలకు తెగించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మీ కష్టాన్ని మరువలేం. రాష్ట్రంలో మరో మూడు పర్యాయాలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు. టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి బూత్‌ స్థాయి నుంచి క్లస్టర్‌ స్థాయి వరకు నాయకులు ప్రజల వద్దకు వెళ్లాలి. మనం చేసిన మంచి పనులు వివరించాలి. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను ‘మై టీడీపీ యాప్‌’లో అప్‌లోడ్‌ చేయాలి.

కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ. గతంలో మీపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్కొక్కటిగా తీసేస్తున్నాం. సమస్యలు ఉంటే నాయకుల దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తారు. త్వరలోనే ప్రతి కార్యకర్తకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, విధ్వంసం చేసి వెళ్లింది. అలాంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుతూనే.. మరో వైపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. ప్రధాని మోదీ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తున్నాం.’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...