WTC పాయింట్స్‌ టేబుల్‌లో దారుణంగా పడిపోయిన పాకిస్థాన్

Date:

ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, జైడెన్ సీల్స్ 5 వికెట్లతో చెలరేగడంతో కేవలం 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో వెస్టిండీస్ డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో 22.73 విజయ శాతంతో 8వ స్థానానికి చేరగా, పాకిస్థాన్ కేవలం 6.67 శాతంతో పాయింట్ల పట్టికలో చివరి (9వ) స్థానానికి పడిపోయింది.

వెస్టిండీస్ ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ చేతిలో 90 రన్స్ తేడాతో పరాజయం పాలైన పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో అట్టడుగు (9వ స్థానానికి) పడిపోయింది. కాగా విదేశీ గడ్డపై పాకిస్థాన్‌కు ఇది వరుసగా 8వ ఓటమి కావడం గమనార్హం. మొత్తంగా ప్రస్తుత డబ్ల్యూటీసీలో ఆడిన ఐదు మ్యాచులలో ఆ జట్టు కేవలం ఒకే మ్యాచులో గెలిచింది. దీంతో 6.66 విజయశాతంతో పాయింట్స్ టేబుల్‌లో చివరిస్థానానికి పడిపోయింది.

తాజా విజయంతో వెస్టిండీస్ 8వ స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు ఆడిన 11 మ్యాచులలో రెండు విజయాలు నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆధిపత్యంలో కొనసాగుతోంది. ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఛాంపియన్ దక్షిణాఫ్రికా రెండో ప్లేసులో ఉంది. ఆస్ట్రేలియా ఆడిన 8 మ్యాచులలో ఏడింట్లో గెలిచింది. ఒక మ్యాచులో ఓడిపోయింది. ఇక రెండో ప్లేసులో ఉన్న సౌతాఫ్రికా 4 మ్యాచులలో మూడు విజయాలు సాధించింది.

మరోవైపు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో 3, 4, 5 స్థానాల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్ ఉన్నాయి. న్యూజిలాండ్ 72.22 విజయ శాతం పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ (58.33 విజయశాతం).. భారత్ (48.15 విజయశాతం) కంటే ముందు ఉంది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ ఉన్నాయి. డబ్ల్యూటీసీ 2027 సైకిల్ ముగిసే సరికి.. టాప్-2లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ రెండు జట్ల మధ్య తుది పోరు జరుగుతుంది. ఇప్పటివరకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌లుగా నిలిచాయి. భారత్.. తొలి రెండు ఎడిషన్లలో రన్నరప్‌గా నిలిచింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...