ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు.. నెలకు రూ.12,500 జీతం ఇస్తారు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

Date:

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 6,534 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 3,597 ఎస్‌జీటీ, 2,937 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి 21 వరకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన వారికి ఆగస్టు 30, 31 తేదీల్లో నియామక ఉత్తర్వులు అందజేస్తారు. సెప్టెంబరు 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఎనిమిది నెలల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

స్కూల్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్‌జీటీలకు రూ.10,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు.

డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు

మరోవైపు డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కంప్యూటర్‌ అప్లికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలనతో పాటు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, మైక్రోబయాలజీ లెక్చరర్‌ పోస్టుల ఎంపిక జాబితాలను కూడా కమిషన్‌ విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...