
కేంద్రం వంట గ్యాస్ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు బ్రేక్ వేసేందుకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అలాంటి వారికి ఈ నెల 15 వరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి పెండింగ్ ఉన్నవారు వెంటనే వివరాలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే రాయితీలు ఆగిపోతాయి, కనెక్షన్ రద్దయ్యే అవకాశం ఉంది.
ఏపీలో గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక.. రాయితీ డబ్బులు రావాలన్నా, ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకోవాలన్నా ఈ-కేవైసీ తప్పనిసరి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో అవకాశం కల్పించారు.. ఈ నెల 15లోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ-కేవైసీపీ పూర్తి చేయకపోతే రాయితీ డబ్బులు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వరు. గ్యాస్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలంటున్నారు.
కేంద్రం వంట గ్యాస్ రాయితీ అర్హులకే దక్కేలా ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. అక్రమ కనెక్షన్లను ఏరివేతపై ఫోకస్ పెట్టింది.. ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ చేపట్టినా ఇప్పటికి కొందరు ఈకేవైసీ చేయించుకోలేదు. గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో లింక్ చేసి.. ఫేస్ రికగ్నేషన్, వేలిముద్రలు, ఐరిస్ విధానాలతో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లోనూ ఈ-కేవైసీ పూర్తి చేయొచ్చు.. లేని పక్షంలో గ్యాస్ ఏజన్సీ కార్యాలయానికి వెళ్లినా అక్కడి సిబ్బంది ఉచితంగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
ముందుగా వినియోగదారులు గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ యాప్‌లోమై ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఎల్‌పీజీ వివరాల కింద ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది.. దానిపై క్లిక్ చేయాలి. స్వీస్‌పై వచ్చే నిబంధనలు, షరతులు చదివి అంగీకరిస్తున్నట్లుగా బాక్స్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా, ఫేస్ స్కాన్ ద్వారా ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియలో చివరిగా సబ్మిట్ చేస్తే.. 24 నుంచి 48 గంటల్లోపు ఈకేవైసీ స్టేటస్ అప్‌డేట్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈ నెల 15లోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

