ఏపీలో ‘సర్‌’ ప్రక్రియ ముమ్మరం 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి

Date:

ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. అమరావతి, జులై 14: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈరోజు(జులై 14) ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలోని మొత్తం 4.16 కోట్ల(4,16,27,694) మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4.14 కోట్ల(4,14,86,830) మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 12.29 లక్షల(12,29,224) ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది.

ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 100 శాతం ప్రక్రియ పూర్తయింది. అలాగే శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, మార్కాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, ప్రకాశం జిల్లాలోనూ 100 శాతానికి ప్రక్రియ చేరింది. దీంతో మొత్తం 13 జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది.

అయితే కొన్ని జిల్లాల్లో ఇంకా ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 98.21 శాతం నమోదైంది. అక్కడ ఇంకా 35,383 ఫారాల డిజిటలైజేషన్ పెండింగ్‌లో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 98.50 శాతం పూర్తి కాగా 25,805 ఫారాలు, వైఎస్ఆర్ జిల్లాలో 99.10 శాతం పూర్తి కాగా 17,067 ఫారాలు ఇంకా డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 756, వైఎస్ఆర్ జిల్లాలో 618 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో 10 రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(CEO) లేఖ రాసినట్లు సమాచారం. గడువు పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు. దీంతో గడువు తేదీ పెంపుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...