Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ.

Date:

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సంఘ సహాయకులు(వీవోఏ)లకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,500 మంది వీవోఏలకు వీటిని అందించింది. విజయవాడలోని రామవరప్పాడు ఎం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వీటిని పంపిణీ చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను బలోపేతం చేయడంలో వీళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో వీళ్లు పనిచేస్తున్నారు. రూ.15 వేల విలువైన ఫోన్‌ను వారందరికీ అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీవోఏలందరికీ వీటిని పంపిణీ చేశారు.

రూ.10 లక్షల ప్రమాద బీమా
వీవోఏలకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా వీరికి స్మార్ట్ ఫోన్లను అందించినట్లు తెలిపారు. మొబైల్స్ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ మరింత మెరుగుపడుతుందన్నారు.

అలాగే కొన్ని నకిలీ సంఘాలపై ప్రభుత్వం తొలగించిందన్నారు. నకిలీ సంఘాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని, గుర్తించిన అనంతరం తొలగిస్తుందని పేర్కొన్నారు. అటు మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలకు వీటి గురించి అవగాహన ఉండటం లేదన్నారు. గ్రామాల్లోని మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే సహకారం అందిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా అదే ఆశిస్తున్నారని, ప్రతీ ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామిక వేత్త ఉండాలనేది లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్
ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టింది చంద్రబాబేనని, 30 ఏళ్ల క్రితమే వీటిని ప్రారంభించి మహిళా సాధికారితను ప్రోత్సహించారని అన్నారు. డ్వాక్రా సంఘాలతో మహిళా నాయకత్వ స్పూర్తి కనిపిస్తుందని, తాను ఏ డ్వాక్రా మహిళ ఇంటికెళ్లినా అతిథినేనని అన్నారు. అయితే రాష్ట్రంలోని వీవోఏలు ఎప్పటినుంచో ఉచిత స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఎట్టకేలకు వారి కోరిక నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా డ్వాక్రా సంఘాల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇటీవల మరో రెండు పథకాలను కూడా ప్రారంభించింది. డ్వాక్రా మహిళల కుటుంబాల్లోని పిల్లల చదువులు, పెళ్లిళ్లకు రుణ సదుపాయం కల్పిస్తోంది. మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి ద్వారా మహిళలకు సులువుగా రుణాలు అందనున్నాయని చెప్పవచ్చు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...