Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?

Date:

Gold Price Drop: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒకనొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా 2 లక్షల వరకు వెళ్లగా, ప్రస్తుతం 25 శాతం వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలు దిగి రావడం శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయా? అనే సందేహంలో ఉన్నారు వినియోగదారులు.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్ల బంగారం ధరలు పతనమయ్యాయి. గతంలో నమోదైన గరిష్ట స్థాయిలతో పోలిస్తే, ప్రస్తుతం ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. గరిష్ట ధరల నుండి సుమారు ఒక భారీ మొత్తంలో తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరలు ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్నప్పటికీ, గత నెలతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు: అంతర్జాతీయ మార్కెట్: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ ముగియడం లేదా డిమాండ్ తగ్గడం వల్ల కూడా మార్కెట్లో ధరలు నియంత్రణలో ఉంటున్నాయి.

ఇదిలా ఉండగా, యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బంగారం ధర చాలా ఎక్కువగా ఉండేది. ఒకానొక సమయంలో బంగారం ధర ఎంతగా పెరిగిందంటే అది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. సోమవారం (ఏప్రిల్‌ 6)న 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,000 వరకు ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇప్పుడు మీరు బంగారం ధర సర్వకాలిక గరిష్ఠ స్థాయిని చూస్తే, బంగారం ఎంత చౌకగా మారిందో మీకు అర్థమవుతుంది. ఒకనొక సమయంలో అంటే గతంలో బంగారం ధర గరిష్ఠ స్థాయి 10 గ్రాములకు రూ. 2,02,984 వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే, బంగారం దాని గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఏకంగా 25 శాతం చౌకగా మారింది. గణాంకాల ప్రకారం, బంగారం దాని సర్వకాలీన గరిష్ఠ స్థాయితో పోలిస్తే ప్రతి 10 గ్రాములకు ఏకంగా రూ. 54,686 వరకు పడిపోయింది. ఇక దేశీయంగా ఏప్రిల్‌ 6వ తేదీన రాత్రి 11 గంటల సమయానికి తులం బంగారం ధరపై 270 రూపాయల వరకు తగ్గి రూ.1,50,660కి కి చేరుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...