Home Loan: రూ. 60 లక్షల హోమ్ లోన్ 10 ఏళ్లలో ఇలా ఈజీగా తీర్చేయొచ్చు.. టెన్షన్‌తో పన్లేదిక

Date:

సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఎంతోమంది జీవితకాలం కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలామంది గృహ రుణాలు తీసుకుంటారు. అయితే, ఈ రుణ భారం కొన్నిసార్లు దశాబ్దాల పాటు వెంటాడవచ్చు. మరి గృహ రుణాలను సమర్థవంతంగా, తొందరగా ఎలా పూర్తి చేయాలో. వడ్డీ మొత్తాన్ని గణనీయంగా ఎలా ఆదా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

25 సంవత్సరాల గృహ రుణాన్ని కేవలం 10 సంవత్సరాలలోపు ఎలా ముగించవచ్చో బిజినెస్ నిపుణులు చెప్పారు. సాధారణంగా, 75 లక్షల రూపాయల గృహ రుణం 8 శాతం వడ్డీ రేటుతో 25 సంవత్సరాలకు తీసుకున్నప్పుడు, నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 58 వేలు అవుతుంది. ఈ టెన్యూర్‌లో వడ్డీ రూపంలోనే దాదాపు రూ. 98 లక్షలు చెల్లించాల్సి వస్తుంది.

ఇది అసలు లోన్ మొత్తం కంటే ఎక్కువ. మరి వడ్డీని ఎలా తగ్గించుకుంటూ వెళ్లాలంటే.. లోన్ స్టార్ట్ అయిన మొదటి నెలల్లో EMIలో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. ప్రిన్సిపల్‌ మొత్తానికి చాలా తక్కువ మొత్తం జమ అవుతుంది. ఉదాహరణకు, మొదటి నెలలో 58,000 రూపాయల EMIలో 50,000 రూపాయలు వడ్డీకి, కేవలం 7,886 రూపాయలు మాత్రమే ప్రిన్సిపల్‌కు వెళుతుంది.

ప్రతి 12 నెలల తర్వాత 13వ నెలలో ఒక అదనపు EMI(అంటే ఒక నెలలో రెండు EMIs) చెల్లించడం ద్వారా గణనీయమైన ప్రయోజనం ఉంటుంది. ఈ వ్యూహంతో, 98 లక్షల రూపాయల వడ్డీ సుమారు 76-77 లక్షల రూపాయలకు తగ్గుతుంది. అంటే దాదాపు 12 లక్షల రూపాయలు ఆదా అవుతాయి. రుణ కాలపరిమితి 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల 3 నెలలకు (243 నెలలు) తగ్గుతుంది. ఇది ఐదు సంవత్సరాల ఆదాకు సమానం. ఏటా జీతాలు పెరిగినందున, ద్రవ్యోల్బణం కారణంగా స్థిరమైన EMI భారం తగ్గుతుంది. కాబట్టి, ఒక అదనపు EMI చెల్లించడం అనేది దీర్ఘకాలంలో పెద్ద భారం అనిపించదు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...