అధిష్ఠానం ఆదేశాలు ధిక్కరించిన చలసాని.. నేడు విజయ డెయిరీ డైరెక్టర్లతో మంత్రుల భేటీ

Date:

అమరావతి, ఆగస్టు 07: విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ అధిష్ఠానం సూచనలు బేఖాతరు చేస్తూ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

ఈ నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఆయనను పార్టీ ఆదేశించింది. దీనిని ఆయన ధిక్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కావాలో? పదవి కావాలో? తెల్చుకోవాలనంటూ చలసాని ఆంజనేయులకు అధిష్ఠానం తేల్చి చెప్పింది. తనకు కొంత సమయం ఇస్తే నిర్ణయం చెబుతానని అధిష్ఠానానికి తెలిపారు.

సమయం ఇవ్వడం కుదరదంటూ చలసాని ఆంజనేయులకు అధిష్ఠానం కుండబద్ధలు కొట్టింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు పార్టీకి ఆయన తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధిష్ఠానానికి ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) విజయ డెయిరీ డైరెక్టర్లతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి సమావేశం కానున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...