విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవి చెన్నుపాటి కాంతిశ్రీని వరించింది. మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకుడు చెన్నుపాటి గాంధీ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడిలో చెన్నుపాటి గాంధీ తన ఒక కన్ను కోల్పోయారు. ఈ ఘటన అనంతరం అప్పట్లో చంద్రబాబు స్వయంగా గాంధీ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంతో డిప్యూటీ మేయర్ పదవిని చెన్నుపాటి గాంధీ సతీమణి కాంతిశ్రీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో గాంధీ కుటుంబానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించినట్లయింది. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కాంతిశ్రీకి ఈ అవకాశం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *