కొవిడ్ కేసులు.. మాస్క్ మళ్లీ తప్పనిసరిగా మారుతుందా?

Date:

దేశంలోని పలుచోట్ల కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో మరోసారి కరోనా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

జూన్ 26 నుంచి జులై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 12 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో నలుగురు మృతి చెందారు. అయితే ఈ నలుగురికీ ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా జులై నెలలో ఇప్పటి వరకు మొత్తం 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం. ప్రస్తుతం దేశంలో కొత్త కరోనా వేవ్‌కు సంబంధించిన సంకేతాలు లేవు. అందువల్ల ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొవిడ్, ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని తెలిపారు. జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం మూడు నుంచి ఐదు రోజులకుపైగా కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...