ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించండి

Date:

సూపర్‌ ఎల్‌నినో సమయంలో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. సూపర్‌ ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో సమావేశమై చర్చించారు.

రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు మంత్రికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నట్టు మంత్రి నిమ్మల తెలిపారు. సాగునీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యతను అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందన్నారు. కాగా, శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నిమ్మల ఆరా తీశారు. త్వరితగతిన కోలుకుని, తిరిగి ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...