‘అభివృద్ధి చేయగానే ప్రజలు ఓట్లు వేయరు’.. ఇదే ఉదాహరణ, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు ఓసారి వినాల్సిందే

Date:

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. తన నియోజకవర్గంలో ఎదురైన అనుభవం గురించి వివరించారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి కనీసం రోడ్డు..ఇళ్లు, బస్సు కూడా లేదన్నారు. ఆ ఊరిని తాను ఆదర్శ గ్రామంగా మార్చినానన్నారు.. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ నేతలకు గెలుపు, ఓటములు సహజం. ఏం చేస్తే ప్రజలు గెలిపిస్తారు?.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా?.. వారి సమస్యలు తీరిస్తే గెలిపిస్తారా?.. ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది. ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా చక్కటి ఉదాహరణను చెప్పారు. తన అనుభవంతో చెబుతున్నానని అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారనుకోవడం సరికాదని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి సంబంధించి తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

అభివృద్ధికి, ఓటుకు సంబంధం లేదంటున్నారు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి. తన సొంత నియోజకవర్గానికి సంబంధించి.. తాను పూర్తి బాధ్యతతో, పూర్తి నమ్మకంతో, అనుభవంతో ఈ విషయాలు చెబుతున్నాను అన్నారు. పీలేరు నియోజకవర్గంలోని మంచాలమంద అని రిమోట్ ఏరియా ఉందని.. అక్కడ 9 కిలోమీటర్లు రోడ్డు లేదన్నారు. తాను 1989లో ఎమ్మెల్యే అయినా 2002 వరకు ఆ గ్రామానికి పోలేదని.. 9 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందన్నారు. ఆ ఊరిలో 800 నుంచి 900 ఓట్లు ఉన్నాయని.. తన తమ్ముడు, ఆ పక్కనే ఉండే మా బంధువులు ఆ గ్రామానికి సంబంధించిన విషయాలను చూసుకునేవాళ్లని చెప్పకొచ్చారు.

‘ఆ ఊరిలో ఎవరికీ ఇల్లు సరిగా లేదు, రోడ్డు లేదు, ఇరిగేషన్ సౌకర్యాలు కూడా లేవు. ఇదంతా చూసి 2004లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకుని అందరికి ఇళ్లు కట్టించాము. 500 ఇళ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చాము.. ఎంపీపీ పదవి కూడా ఆ గ్రామానికి చెందిన వారికే ఇచ్చాము. అలాగే 4వేల ఎకరాలకు నీళ్లు వచ్చేలా రెండు చెక్‌డ్యామ్‌లు కట్టించాము.. రూ.కోటితో ఆ ఊరికి రోడ్డు వేయించాము. ఆ ఊరికి రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇళ్లు వచ్చాయి, పొలాలకు నీళ్లు వచ్చాయి. కానీ ఆ ఊరిలో ముందు ఎన్నికల్లో 300 ఓట్లు వస్తే.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 30 ఓట్లు మెజార్టీ వచ్చింది’ అని వివరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నీరసం దూరం చేసి బలాన్నిచ్చే సూపర్‌ఫుడ్.. ఇలా చేస్తే నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్‌ఫాస్ట్!

ఉదయం పూట రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలంటే పోషకాలు ఉన్న అల్పాహారం...

యశ్‌పై దిల్ రాజు నమ్మకం.. ‘టాక్సిక్’కు రూ.120 కోట్ల బిగ్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక...

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్-జీ సమావేశం.. యువత ప్రశ్నలకు ఆలోచింపజేసేలా ‘కూల్ గురు’ సమాధానాలు..!

భయం వెంటాడుతున్నప్పటికీ స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? విజయం కోసం జరిగే...