ఫార్ములా-ఈ రేస్ కేసు.. 25వ తేదీకి విచారణ వాయిదా

Date:

ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో ఈరోజు(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీబీ కోర్టు నోటీసులతో తొలిసారిగా విచారణకు కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు.

ఫార్ములా-ఈ రేస్ కేసులో ఇప్పటికే ACB చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కార్‌ రేస్‌తో HMDAకు రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని చార్జ్‌షీట్‌‌లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, FEO కంపెనీని నిందితులుగా ఏసీబీ అధికారులు ఈ కేసులో చేర్చారు.

ఛార్జ్‌షీట్ ధాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ట్రయల్ మొదలు పెట్టనుంది. తదుపరి విచారణను ఆగస్టు25వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కేటీఆర్ లక్ష పూచీకత్తు , 2 షూరిటీస్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...