ఉచిత పథకాలతో సమాజానికి తీవ్ర నష్టం: తెలంగాణ హైకోర్టు

Date:

హైదరాబాద్, ఆగస్టు 7: కోర్ట్ ధిక్కరణ వ్యవహారంలో తెలింగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. సందీప్ సుల్తానియా కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సందీప్ సుల్తానియాపై వెయ్యి కేసులు ఉన్నాయని. అవన్నీ విచారణ చేస్తే జీవిత కాలం జైల్లో ఉండాలని పేర్కొంది. ప్రభుత్వాలు చేసిన తప్పుకు అధికారులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధగా ఉందని.

తప్పని పరిస్థితుల్లో హాజరుకావాలని ఆదేశిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. ఉచిత పథకాల వల్ల చాలా ప్రమాదం ఉందని. రైతుబంధు అనేది సంపన్నులకు, అధికారులు కూడా తీసుకుంటున్నారని. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుబంధుతో రాష్ట్ర ఖజానాకు భారమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో నిన్న(గురువారం) హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిల విడుదలపై కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంతో హైకోర్టు సీరియస్ అయ్యింది.

సందీప్ సుల్తానియా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేసి హాజరపరచాలని నిన్న హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు(శుక్రవారం) కచ్చితంగా హైకోర్టు ముందు హాజరవుతానని తెలపడంతో సుల్తానియాకు బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతోపాటు రూ.5000 పూచికత్తుతో బెయిల్‌పై హైదరాబాద్ సీపీ విడుదల చేశారు. సందీప్ సుల్తానియా బెయిల్‌పై విడుదల వివరాలను హైదరాబాద్ పోలీసులు. కోర్టుకు సమర్పించారు. 2024లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సందీప్ సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదనంటూ రామకృష్ణ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...