పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి

Date:

సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దోనుబాయి జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన మన్యం సవారీ బైక్‌ర్యాలీని గురువారం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. సీతంపేట నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తు దోనుబాయి సమీపంలో ఉన్న సున్నపుగెడ్డ జలపాతం వరకు ఈ బైక్‌ర్యాలీ సాగింది.

ప్రకృతి సోయగాలకు నిలయమైన సున్నపుగెడ్డ జలపాతం వద్ద టెంట్‌హౌస్‌లో కూర్చుని కట్టెలపొయ్యిపై చేసిన వంటకాలను కలెక్టర్‌, ఎమ్మెల్యే రుచి చూశారు. జిల్లాలో ఎన్నో జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లే రహదారులను త్వరలోనే అభివృద్థి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కాంక్రీట్‌ జంగిల్‌ దాటి అడవుల్లో కనీసం 3గంటలు గడిపితే శరీరానికి లభించే ఆక్సిజన్‌

సహ జ వ్యవసాయంతో మంచి ఆదాయం వస్తుందని, మంచి ఆరోగ్యం కూడా సమ కూరుతుందని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బూర్జగూడ గ్రామాన్ని సందర్శిం చారు. జీవ స్టార్స్‌ను పరిశీలించారు. కూరగాయలు, మామిడి మొక్కలు, నాటుకోళ్ల పెంపకం, జీవామృతం గురించి గిరిజన రైతులు కలెక్టర్‌కు వివరించారు. 30 గ్రామాల్లో 580మంది రైతులతో జీవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డ్‌ డీడీఎం దినేష్‌రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే జయక్రిష్ణ, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌ నూక సన్యాసిరావు, మన్యం సహజ ఉత్పత్తుల కంపెనీ సీఈవో బి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...