గ్యాస్ కొరత.. ఈ 5 కిలోల సిలిండర్లకు ఫుల్ డిమాండ్.. 2 వారాల్లోనే ఏకంగా 6.6 లక్షల అమ్మకాలు

Date:

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఇప్పటికీ ఇబ్బందులు అలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసిన కొన్ని రోజులకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్న సిలిండర్లకు ఆదరణ పెరిగింది. 2 వారాల వ్యవధిలో 6 లక్షలకుపైగా సేల్ అయ్యాయి. పూర్తి వివరాల్ని మనం ఇప్పుడు చూద్దాం.

చాలా మందికి బుకింగ్ చేసిన 15 రోజులు దాటితే గానీ గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారతదేశంలో చిన్న గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్లను జనం విపరీతంగా కొంటున్నట్లు తెలుస్తోంది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దాదాపు 6.6 లక్షల ఈ చిన్న గ్యాస్ సిలిండర్లు అమ్ముడుబోయినట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ చిన్న గ్యాస్ సిలిండర్లనే ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లుగా (FTL) పిలుస్తుంటారు. సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల మాదిరిగా వీటికి ప్రత్యేకంగా బుకింగ్ అవసరం లేదు. అడ్రస్ ప్రూఫ్ అంతకన్నా అవసరం ఉండదు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల్ని చూపించడం ద్వారా సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు లేదా దగ్గర్లోని కన్వీనియెన్స్ సెంటర్ల దగ్గర తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని.. మార్చి నుంచి సుమారు 50 వేలకుపైగా దాచి ఉంచిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...