
తిరుమల, ఆంధ్రప్రభ: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
ఆలయ అధికారుల వివరాల ప్రకారం, నిన్న స్వామివారిని 73,226 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,754 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.2.66 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇక భక్తులకు 3.63 లక్షల లడ్డూలను విక్రయించగా, 1.58 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు అధికారులు వెల్లడించారు.
