స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశాలు కల్పించిందని ఆమె తెలిపారు.

గురువారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి అనిత పర్యటించారు. దేవవరం గ్రామంలోని వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవవరం, గొడ్డిచర్ల గ్రామాల్లో స్థానిక ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పాయకరావుపేటకు పరిశ్రమలు.. యువతకు ఉపాధి అవకాశాలు

పాయకరావుపేట నియోజకవర్గానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చామని అనిత తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి యువతకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్నబ్ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని హోంమంత్రి అనిత తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

కూటమి పాలనలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని స్థానిక సంస్థల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని ఆమె వివరించారు. గ్రామాల అభివృద్ధి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *