బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవుల పరిసరాల్లో మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ తర్వాతి 24 గంటల్లో ఈ వాతావరణ వ్యవస్థ ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ సముద్ర పరిసరాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం

ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులను బట్టి వర్షాల తీవ్రత వాయుగుండం కదలికలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వాతావరణ పరిస్థితులపై అధికారుల నిశిత పరిశీలన

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశాల నేపథ్యంలో వాతావరణ మార్పులను నిరంతరం పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న రోజుల్లో వాయుగుండం దిశ, వేగం, దాని ప్రభావంపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే అధికారిక సూచనలను గమనించాలని సూచించింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *