• ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కలిసి రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 3D హౌసింగ్ పైలట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేగవంతమైన, మన్నికైన, తక్కువ వ్యయంతో 3D ప్రింటింగ్ సాంకేతికత ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
  • ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ గృహ నిర్మాణ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలనకు ఈ ప్రాజెక్ట్ నాంది పలకనుంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో తక్కువ సమయంలో నాణ్యమైన ఇళ్లను నిర్మించే దిశగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కీలక ముందడుగుగా నిలవనుంది.

By Rajini