
D news: నేడు పెట్రోల్ బంకులు మన జీవితంలో భాగమైపోయాయి. కానీ భారత్‌లో తొలి పెట్రోల్ బంక్ 1928లో ముంబైలోని హ్యూజెస్ రోడ్లో ప్రారంభమైందని పలు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అన్నీ బెసెంట్ రోడ్‌గా పిలుస్తారు. దీన్ని అప్పట్లో బర్మా షెల్ నిర్వహించింది. అనంతరం ఇది భారత్ పెట్రోలియం (BPCL)లో భాగమైంది.
ఆ రోజుల్లో పెట్రోల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. బంకుల్లో నేటిలా ఆటోమేటిక్ డిస్పెన్సర్లు కాకుండా చేతితో పనిచేసే పంపులు ఉండేవి.
అప్పట్లో ధర ఎంత?
1928లో పెట్రోల్‌ను ప్రధానంగా గ్యాలన్ వంటి పాత కొలతల్లో విక్రయించేవారు. కొన్ని చారిత్రక వివరాల ప్రకారం లీటర్ పెట్రోల్ సుమారు 12 పైసలు ఉండేది. అంటే ఒక రూపాయికి దాదాపు 8.33 లీటర్ల పెట్రోల్ వచ్చేదన్నమాట!
నేటి ధరలతో పోలిస్తే అప్పటి పెట్రోల్ ధర నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.

