విశాఖపట్నం, విశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో విదేశీ బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కారును గుర్తించిన అధికారులు దానిని వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం కారులో తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పెరుగుతున్న బంగారం ధరలు.. అక్రమ రవాణాపై నిఘా

ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరుగుతుండటంతో విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, బస్టాండ్లు, జాతీయ రహదారులతో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు.

తాజాగా విశాఖలో పట్టుబడిన బంగారం రవాణా వెనుక ఎవరున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *