హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్‌ నంబర్‌ 131 సమీపంలో ఆరాంఘర్‌ వైపు వెళ్లే మార్గంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక నుంచి వస్తున్న మరో ఐదు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ వరుస ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కార్లను పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొనడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న ఓ కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ఐదు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు కార్లు దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ కార్లలో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరు కార్లు వరుసగా ఢీకొన్న ఘటనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన కార్లను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ కవచ్‌’.. నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు ‘ఆపరేషన్‌ కవచ్‌’ పేరుతో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక తనిఖీల్లో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి.

ఈ ఆపరేషన్‌లో భాగంగా వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు, ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి కొన్ని వాహనాలను సీజ్‌ చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ప్రజల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి నగర ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నగరంలో నేరాలను నియంత్రించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజలకు మరింత భద్రత కల్పించడం ఈ ఆపరేషన్‌ ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *