“రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి”.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!

Date:

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

తాజాగా ఇరాన్‌లోని అత్యంత ముఖ్యమైన చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపంపై వరుస దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఇరాన్‌కు గడువు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువుకు కొద్ది క్షణాల ముందు ఈ దాడి జరిగింది. మరోవైపు ఇరాన్‌కు ఇచ్చిన గడువులోగా టెహ్రాన్‌ను నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. సోషల్ ట్రూత్ అనే వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో, మంగళవారం రాత్రి (ఏప్రిల్ 7, 2026) ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడం ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. తాను ఇలా చేయాలని కోరుకోలేదని, కానీ అలా చేయక తప్పడం లేదని ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు.

ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది. రాబోయే 48 గంటల పాటు భారత పౌరులు ఉన్నచోటనే ఉండాలని కోరింది. ‘భారత రాయబార కార్యాలయం బుక్ చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు లోపలే ఉండాలి. అక్కడ ఉన్న రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలి’ అని ఆ సలహాలో పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...