
విశాఖపట్నం: విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణి, ఆమె కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం పరామర్శించారు. శ్రావణి తండ్రి, టీడీపీ సీనియర్ నేత ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం మృతి చెందడంతో విశాఖలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ముత్యాల నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్‌గా, టీడీపీ నాయకుడిగా, విశాఖ జిల్లా పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి వెంట ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడె పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.




