బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో సంబంధం లేదు.. జనసేన కీలక ప్రకటన

Date:

జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేశారు.. అయితే పార్టీలో మాత్రం కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా జనసేన పార్టీ బొలిశెట్టి ఎపిసోడ్‌పై స్పందించింది. ఆయనకు పార్టీకి అనుబంధం లేదన్నారు.. ఆయన చేపట్టే కార్యక్రమాలకు జనసేనకు సంబధం లేదని ప్రకటన విడుదల చేశారు. అయితే పార్టీ ప్రకటనపై బొలిశెట్టి సత్యనారాయణ కూడా స్పందించారు.

విశాఖపట్నానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణకు సంబంధించి కీలక ప్రకటన జారీ అయ్యింది. ఇటీవల ఆయన జనసేన పార్టీలో పదవులకు రాజీనామా చేశారు.. తాను హైకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ విషయంలో జనసేన పార్టీకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. వెంటనే స్పందించిన బొలిశెట్టి తాను పార్టీ పదవులకు మాత్రమే రాజీనామ చేశానని.. పార్టీలోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా బొలిశెట్టి ఎపిసోడ్‌పై జనసేన పార్టీ కూడా స్పందించింది.

జనసేన పార్టీతో ఎటువంటి అనుబంధం లేదని ప్రకటనలో తెలియజేసింది. ఆయన తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అంగీకరించారన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకీ పార్టీకీ సంబంధం లేదని వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. అయితే పార్టీ ప్రకటనపై బొలిశెట్టి సోషల్ మీడియా వేదికగా మరో ప్రకటనను విడుదల చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...