ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెకు నారా లోకేష్ ‘వెడ్డింగ్ గిఫ్ట్’.. నాకు ఎసరు పెట్టొద్దని దండం పెట్టిన ఎమ్మెల్యే

Date:

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చిన్న కుమార్తె వివాహం బుధవారం అట్టహాసంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే నారా లోకేష్.. పెళ్లి కుమార్తెతో జరిపిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయ్ సిద్ధంగా ఉండాలంటూ నారా లోకేష్ సరదాగా వ్యాఖ్యానించగా.. నాకు ఎసరు పెట్టొద్దంటూ ధూళిపాళ్ల నరేంద్ర నవ్వుతూ దండం పెట్టారు. దీంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి సహా అందరి ముఖాల్లోనూ నవ్వులు వెరిశాయి.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేదీ ఎవరూ ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నేతలు వేసే ప్రతి అడుగు రాజకీయంతో ముడిపడి ఉంటుంది. రాజకీయ కారణాలతో కలగలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్.. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వివాహ వేడుకల్లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ సీనియర్ నేత, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తి వివాహం బుధవారం రోజు అట్టహాసంగా జరిగింది. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో నాగసాయి వైదీప్తి- కెవిన్ రామ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత సహా పలువురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే వివాహ వేడుకల్లో నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంభాషణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇరువురు నేతల ఆత్మీయ పలకరింపు వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వధూవరులతో సరదాగా సంభాషించిన మంత్రి నారా లోకేష్.. “మహిళా రిజర్వేషన్ వస్తోంది రెడీగా ఉండు.. అంటూ” పెళ్లి కుమార్తె, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెతో సరదాగా అన్నారు. అయితే అక్కడే ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర వెంటనే దీనికి వెంటనే స్పందించారు. మాకే ఎసరు పెడితే ఎలా బాబు గారూ అంటూ నవ్వుతూ దండం పెట్టారు. దీంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి కూడా నవ్వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...