
జర్మనీ, జపాన్ దేశాల్లో తెలంగాణ యువతకు అపార ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. జర్మనీలో ఇప్పటికే 5 లక్షల ఖాళీలు ఉన్నాయని, త్వరలోనే జపాన్ పర్యటన ద్వారా మరిన్ని అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. జర్మన్, జపనీస్ భాషలపై పట్టు సాధిస్తే నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని.. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం మేం జర్మనీ వెళ్లాం. జర్మనీలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నయ్. ఈనెల 23న మేం జపాన్ పోతున్నాం. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నయ్. ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నయ్ కాబట్టి యువత ఆలోచించాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి. అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలా చేస్తే తెలంగాణలో నిరుద్యోగత కూడా తక్కువైతది. ఎక్కువ మంది విదేశాలకు పోయినప్పుడు.. ఇక్కడ ఉన్నవాళ్లకు ఉద్యోగాలు దొరుకుతయ్. అందుకు ప్రభుత్వాలు, పలు సంస్థలు పని చేస్తయ్. మేం జర్మనీలో, జపాన్‌లో కల్పించే ఉద్యోగాలకు భారీ జీతం ఉంటుంది. సుమారుగా రూ.2.50 లక్షల వరకు జీతం ఉంటుంది. ఎవరైతే చక్కగా జర్మన్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వారికి నెలకు రూ.2 లక్షలకు పైగానే జీతం లభిస్తుంది. మీరు సంవత్సరానికి రూ.25 లక్షల రూపాయులు సంపాదించుకోవచ్చు.’ అని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.

