తిరుమల శ్రీవారి చెంత 223.63 ఎకరాల్లో మోడల్‌ టౌన్‌షిప్‌.. ఆ ప్రాంతం దశ తిరిగింది

Date:

తిరుపతి సమీపంలో మోడల్ టౌన్‌షిప్ దిశగా మరో ముందగుడు పడింది. శెట్టిపల్లి దగ్గర 263 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న టౌన్‌షిప్‌ను అత్యాధునిక మౌలిక వసతులతో ప్లాన్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ సమగ్ర ప్రణాళికలు రూపొందించందుకు రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో డీపీఆర్, డ్రోన్, జియో- శాటిలైట్‌ సర్వే పనులు ప్రారంభించారు. తుడా ఛైర్మన్ దివాకర్‌ రెడ్డి సంస్థ ప్రతినిధులతో మౌలిక సదుపాయాలపై చర్చించారు.

తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో తుడా మోడల్‌ టౌన్‌షిప్‌ దిశగా మరో కీలక ముందగుడు పడింది. శెట్టిపల్లి మోడల్ టౌన్‌షిప్ అభివృద్ధికి తుడా సమగ్ర ప్రణాళికను వేగవంతం చేసింది. మొత్తం 223.63 ఎకరాల్లో అత్యాధునిక మౌలిక వసతులతో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన NCPE Pvt. Ltd సంస్థ డీపీఆర్, డ్రోన్, జియో-సాటిలైట్ సర్వేలను ప్రారంభించింది. తుడా ఛైర్మన్‌ సి.దివాకర్‌రెడ్డి సర్వే పనులను ప్రారంభించారు. మొత్తం 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు, అంతర్గత రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, గోవింద ధామం, పార్కులు తదితర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాల లేఅవుట్‌ను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.

శెట్టిపల్లిలో 223.63 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో సేకరించి లబ్ధిదారులకు కేటాయించారు. ఈ మొత్తం భూమిలో మరో 65 ఎకరాలను మౌలిక సదుపాయాల కోసం ‘తుడా’కు కేటాయించారు.. అలాగే 90 ఎకరాలను పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేటాయించారు. కనీసం రెండు సెంట్ల స్థలం వచ్చేలా అర్హులైన 823 మందికి మొత్తం 2,111 ప్లాట్లను లేఅవుట్‌ ప్లాన్ చేశారు.. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్లు చేశారు. అక్కడ 223.63 ఎకరాల్లో మోడల్‌ టౌన్‌షిప్‌ అభివృద్ధి చేయనున్నారు. ఈ శెట్టిపల్లి టౌన్‌షిప్‌ ద్వారా లబ్ధిదారులకు దాదాపు రూ.1,100 కోట్ల విలువైన ఆస్తి దక్కింది.. ఇటు రిజిస్ట్రేషన్‌ ఫీజుల మాఫీ చేయడంతో మరో రూ.16.25 కోట్ల మేర లబ్ధి కలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శెట్టిపల్లి మోడ్రన్ టౌన్‌షిప్ విధానాన్ని ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...