
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో ఆ ప్రేమ జంట దూకింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాల్వలోకి దూకడంతో ఉధృతమైన నీటి ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయారు.
విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి యువకుడిని కాపాడారు. అయితే యువతి నీటి ప్రవాహంలో గల్లంతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, భీమవరానికి చెందిన యువతి ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతి కుటుంబ సభ్యులతో పాటు ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.

