ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్‌ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా ఒక రోజును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయిస్తున్నారని చెప్పారు.

శుక్రవారం నెల్లూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 135 లక్షల టన్నుల చెత్తను మిగిల్చి వెళ్లిందని దాన్ని దశలవారీగా తొలగిస్తున్నామని తెలిపారు.

విశాఖపట్నం, గుంటూరులో ఏర్పాటు చేసిన వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పనులను వెంటనే ప్రారంభించి మూడు దశల్లో పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు శాశ్వత నివాస పత్రాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాల పేరుతో ప్రజలను మోసం చేశారని వైసీపీపై మంత్రి నారాయణ విమర్శలు చేశారు.

రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితి నుంచి బయటపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో కాలేజీ మరింత అభివృద్ధి 

By Rajini