Homenewsనాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

Published on

spot_img

నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు.

హైదరాబాద్, నవంబరు12 నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం (Akkineni Nagarjuna Family) మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సురేఖ మరోసారి స్పందించారు.

ఈ క్రమంలో ఆమె నిన్న(మంగళవారం) అర్థరాత్రి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. నాగార్జున కుటుంబం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని తేల్చిచెప్పారు మంత్రి కొండా సురేఖ.

ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు రేపు(గురువారం) నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేయనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ విచారణకు ఒక రోజు ముందుగా నాగార్జునను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ఈ పోస్ట్ పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this