సీఎంఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫోకస్ డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలకు సన్నాహాలు

Date:

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించించారు. సీఎంఆర్‌లో గత 10-12 ఏళ్లుగా జరిగిన వ్యవహారాలపై లోతుగా పరిశీలన చేపట్టారు. సీఎంఆర్ వ్యవస్థలో పారదర్శకత, సాంకేతిక సంస్కరణలపై చర్చించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇప్పటివరకు నిర్వహించిన విజిలెన్స్ దాడులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల పనితీరు, సీఎంఆర్ బకాయిల పరిస్థితి, డిఫాల్ట్‌ల వివరాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు అనుసరించాల్సిన కొత్త వ్యూహాలను రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, లీగల్ విభాగాల ఉన్నతాధికారులకు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రభుత్వ నిధుల రక్షణే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...