
కూటమి సీట్ల సర్దుబాటులో ఈ జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన నాయకురాలిగా నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆమెకు సీతానగరం మండలంలో మంచి పట్టుంది. జిల్లాలో మొత్తం 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 14 స్థానాల్లో టీడీపీ, ఏడు స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి.
తూర్పు జడ్పీటీసీ స్థానాన్ని జనరల్ కేటగిరీకి కేటాయించారు. పొత్తులో భాగంగా జడ్పీ చైర్‌పర్సన్ పదవి జనసేనకు దక్కితే వెంకటలక్ష్మీకి ఆ అవకాశం లభించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఆమె జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
