నందికొట్కూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని 18వ వార్డు లింగం వీధిలో టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

నందికొట్కూరు మున్సిపల్ కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి మొల్ల సబేరున్నిసా, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొండారెడ్డి రజనీకుమార్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని శివానందరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత పెరిగిందని శివానందరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్ఫూర్తితో పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో లింగం వీధితో పాటు పట్టణంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు, పక్కా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నందికొట్కూరు పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో 18వ వార్డు పట్టణ కూటమి నాయకులు లాయర్ జాకీర్ హుస్సేన్, అక్బర్ బాషా, మెహబూబ్ బాషా, షాకీర్, దినకర్, సొసైటీ చైర్మన్ మూర్తి జావలి, బ్రహ్మం, ప్రసన్నారెడ్డి, ప్రభుకుమార్, హుస్సేన్, కలాం, ప్రవీణ్, గని నదీమ్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *