లా పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుభవార్త తెలిపింది. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 26లోగా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు సెప్టెంబర్‌ 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

  • స్క్రీనింగ్‌ టెస్ట్‌: 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మెరిట్‌ ఆధారంగా 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష: మూడు పేపర్లు ఉంటాయి. సివిల్‌ లా, క్రిమినల్‌ లా, ఇంగ్లిష్‌ (ట్రాన్స్‌లేషన్‌, ఎస్సే రైటింగ్‌)పై పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు, 3 గంటల సమయం ఉంటుంది.
  • వైవా వోస్‌: రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో పిలుస్తారు. వైవాకు 50 మార్కులు ఉంటాయి.

జీతం, ఫీజు

ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.1,500 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు.

దరఖాస్తుకు చివరి తేదీ

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 26లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

By Ramya