46 ఏళ్ల కిందట ఇదే జులై 18న.. అబ్దుల్ కలామ్ సాక్షిగా భారత అంతరిక్ష చరిత్రలో అద్భుతం

Date:

భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొదటిసారి ప్రైవేటు రంగంలో ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌‌ను భారత్ విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి శనివారం ఈ రాకెట్‌ను ప్రయోగించారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ దీనిని రూపొందించింది. అయితే, 46 ఏళ్ల కిందట ఇదే రోజున భారత్ తొలి స్వదేశీ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాటి మిషన్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నాయకత్వం వహించారు.

భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలిచిన SLV-3కి, ఈ విక్రమ్-1 కి మధ్య ఉన్న సంబంధాలు కేవలం తేదీతోనే ముడిపడలేదు. నాటి SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ మన మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యవహరించడం విశేషం. విక్రమ్-1 ద్వారా స్కైరూట్ సంస్థ ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఈ రాకెట్‌లోని మూడు ఘన-ఇంధన దశలకు ఆయన జ్ఞాపకార్థం కలాం-1200, కలాం-250, కలాం-100 అని పేర్లు పెట్టడమే కాకుండా.. ఆయన సూక్ష్మ కళాఖండాన్ని కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...