• శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం మహ్మదాపురంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు.
  • ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఆలయాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
  • రాష్ట్రవ్యాప్తంగా 6,700 ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల నిర్వహణ కోసం నెలకు రూ.10 వేల చొప్పున పూజారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆలయాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

ఆత్మకూరు అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు

  • అనంతరం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
  • ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సోమవారం రూ.35 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసినట్లు వెల్లడించారు. సోమశిల జలాశయం నుంచి పైపులైన్ ద్వారా ఆత్మకూరు పట్టణానికి తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు.
  • అలాగే, ఆత్మకూరు పట్టణంలో అంబేడ్కర్ భవనం, షాదీ మంజిల్ నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *