అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారు: పల్లా శ్రీనివాసరావు

Date:

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రాకు మణిహారమని గుర్తు పెట్టుకో జగన్ అని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఆటంకం కలిగించేందుకే విశాఖకు జగన్ వచ్చారని ఆరోపించారు.

కుతంత్రాలతో అభివృద్ధిని ఆపలేరని పల్లా అన్నారు. రానున్న కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. గాజువాక నుంచి125, జిల్లా మొత్తం 5000 వేల బస్సుల్లో 5 లక్షల మంది ప్రజలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రత్యేకంగా దర్శించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల అంతర్జాతీయంగా వ్యాపారస్థులు ఉత్తరాంధ్రకు రావడం అలాగే పరిశ్రమలు స్థాపించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రానున్న కాలంలో ఉత్తరాంధ్ర.. స్వర్ణాంధ్ర బాటలో వెళ్లి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఇకపై ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...