మాట నిల‌బెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పిఠాపురంలో అభివృద్ధి జోరు, 307 కి.మీ కొత్త రోడ్లు

Date:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పల్లెల నుంచి పట్టణాల వరకు భారీ స్థాయిలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పల్లెల నుంచి పట్టణాల వరకు భారీ స్థాయిలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ, ఇతర నిధులతో మొత్తం 307 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల పనులు పూర్తి కాగా, మరో 70 రోడ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. మొత్తం ప్రాజెక్టులో దాదాపు 80 శాతం పనులు పూర్తికావడంతో పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల కోత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాయాపట్నం మత్స్యకారులకు గతంలో సుబ్బంపేట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. రూ.1.52 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అలాగే కొత్తసూరాడపేట కాలనీలో రూ.93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి, వాటిని సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారితో అనుసంధానం చేశారు. యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి–రామన్నపాలెం బీచ్ రోడ్ తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.88 లక్షలతో రహదారిని పునర్నిర్మించారు. దీంతో బషీర్ బీబీ ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...