ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఎలాంటి భద్రతా సిబ్బంది, కాన్వాయ్ లేకుండా ఆయన ఒంటరిగానే సీఎం నివాసానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. తన వాహనాన్ని డ్రైవర్ నడుపుతుండగా పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రెబల్ అభ్యర్థుల వ్యవహారం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *