ప్రొఫెసర్‌పై చెయ్యి చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్.. సస్పెండ్ చేస్తూ క్యాంపస్‌లోకి ప్రవేశం నిషేధించిన డీయూ

Date:

ఢిల్లీ యూనివర్సిటీలోని ఉమాంగ్ భవన్‌లో ఓ ప్రొఫెసర్‌పై పీహెచ్‌డీ స్కాలర్ దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో నేరుగా ప్రొఫెసర్ వద్దకు వెళ్లిన విద్యార్థి.. ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

దాడి ఘటనపై యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సదరు పీహెచ్‌డీ స్కాలర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ప్రొఫెసర్‌పై దాడికి దారితీసిన కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ప్రొఫెసర్‌, విద్యార్థి మధ్య అసలు ఏ విషయంలో వివాదం తలెత్తిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఢిల్లీ యూనివర్సిటీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. లా ఫ్యాకల్టీకి చెందిన ఓ పీహెచ్‌డీ స్కాలర్ ఏకంగా ప్రొఫెసర్‌పై చేయి చేసుకున్నాడు. నేరుగా ప్రొఫెసర్ వద్దకు వెళ్లి చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ అధికారులు తీవ్రంగా స్పందించారు.

దాడికి పాల్పడిన పీహెచ్‌డీ స్కాలర్‌ను యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ప్రొఫెసర్‌, విద్యార్థి మధ్య ఏం జరిగింది? దాడికి దారితీసిన కారణాలేంటి? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యూనివర్సిటీ ప్రోక్టర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఉమాంగ్ భవన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయమే ప్రొఫెసర్ వద్దకు వెళ్లిన పీహెచ్‌డీ స్కాలర్.. ఆయన చెంపపై కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రోక్టర్ మనోజ్ కుమార్ సింగ్.. 2024-25 విద్యా సంవత్సరంలో లా ఫ్యాకల్టీలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. సీసీటీవీ ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ చట్టం-1922లోని ఆర్డినెన్స్ XV-B నిబంధనల ప్రకారం.. సదరు విద్యార్థిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రోక్టర్ వెల్లడించారు. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఇందుకు సంబంధించి ప్రోక్టర్ కార్యాలయం అధికారికంగా నోటీసు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...