
లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మొబైల్ ఫోన్‌తో పట్టుబడటం కలకలం రేపింది. క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆయన వద్ద మొబైల్ ఫోన్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో జైలు భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఘటనకు సంబంధించి ఓ జైలు అధికారిపై సస్పెన్షన్ వేటు పడగా, ఉన్నతాధికారులపై కూడా చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు, ప్రజ్వల్ రేవణ్ణపై జైలు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కొత్త కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
లైంగిక దాడి కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా ఆయన వద్ద మొబైల్ ఫోన్ లభించడం కలకలం రేపింది.
క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రేవణ్ణ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆయనపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే జైలు భద్రతలో నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టి ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్ ఎలా చేరిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగపూర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
మరోవైపు, జైలు భద్రతలో వైఫల్యానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ అంశుచ్ కుమార్‌కు అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. జైలులోకి మొబైల్ ఫోన్ ఎలా చేరిందనే దానిపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

