భోగాపురం’ కోసం 15 వేల ఎకరాల భూసేకరణ ప్రతిపాదన.. చంద్రబాబు ఒరిజినల్ ప్లాన్ ఇది..!

Date:

భోగాపురం విమానాశ్రయం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. తొలి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే వీలుంది. ఏడాదికి 25 వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం ఉన్న కార్గో టెర్మినల్‌ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయం కోసం ప్రభుత్వం 2703 ఎకరాల భూమిని సేకరించింది. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా 15 వేల ఎకరాల భూమి సేకరించాలని భావించారు.

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల కోసం కూడా 5500 ఎకరాలకు మించి భూమిని సేకరించలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం 5500 ఎకరాలను సేకరించడమే ఇప్పటి వరకూ గరిష్టం. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం కోసం 5106 ఎకరాలు, బెంగళూర్ ఎయిర్‌పోర్ట్ కోసం 4000 ఎకరాలు సేకరించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ కోసం సేకరించిన భూమికి దాదాపు మూడు రెట్ల భూమిని భోగాపురంలో సేకరించాలని చంద్రబాబు ఎందుకు అనుకున్నారు? ఆయన ప్లాన్ ఏంటి? అనేది చూద్దాం.

భోగాపురంలో విమానాలు రాకపోకలు సాగించే ఓ విమానాశ్రయం నిర్మించడం మాత్రమే కాదు.. ఇంటిగ్రేటెడ్ ఏరోసిటీని నిర్మించాలనేది చంద్రబాబు అసలు ప్లాన్. విమానాల రిపేర్లు, సర్వీసింగ్‌ సెంటర్లతోపాటు.. పైలట్లు, ఇతర విమాన సిబ్బందికి శిక్షణ ఇచ్చే అకాడమీలను ఇక్కడ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారు. అలాగే విమాన విడిభాగాల తయారీ, రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పాలని అనుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...